ఆలయంలో పుట్టిన రోజు కేక్ కట్ చేయడంతో 10 మంది ఉద్యోగుల సస్పెన్షన్ (వీడియో)

78చూసినవారు
ఆలయంలో పుట్టిన రోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు చేసుకోవడంతో 10 మంది ఉద్యోగులపై వేటు పడింది. మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో అదే ఆలయంలోని ఓ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగులు ఓ యువతి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేశారు. దీంతో మహాకాళేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ (MTMC) వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మొత్తం 10 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్