ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై నిషేధం విధించింది. భక్తులు తిరుపతి మీదుగానే తిరుమలకు వెళ్లాల్సి ఉంది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే మార్గాలలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, కపిలతీర్థం, అలిపిరి, స్విమ్స్, రుయా ఆసుపత్రి సర్కిల్ వరకు ఉన్న బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.