ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లాంతర్ పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ చేశారు. వైసీపీ హయంలో రూ.35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు.