ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామానికి చెందిన టిడిపి నేత మాజీ జడ్పిటిసి సుద్ధ పల్లె చాంద్ బాషా నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. సోమవారం రోజున అంతిమయాత్ర పాల్గొన్న ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.