ఆలూరు: నారా రామ్మూర్తి నాయుడి మరణం బాధాకరం

72చూసినవారు
ఆలూరు: నారా రామ్మూర్తి నాయుడి మరణం బాధాకరం
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి మరణం అత్యంత బాధాకరమని, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్  వీరభద్రగౌడ్ అన్నారు. ఆదివారం ఆలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి చిత్రపటానికి వీరభద్రగౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. రామ్మూర్తి ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ఆయన కోరారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్