మొహరం వేడుకలు ప్రశాంతంగా జరిపినందుకు సీఐ కి సన్మానం

75చూసినవారు
మొహరం వేడుకలు ప్రశాంతంగా జరిపినందుకు సీఐ కి సన్మానం
ఆస్పరి మండలంలో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆస్పరి గ్రామ పెద్దలు సీఐ హనుమంతప్పను శాలువ, పూలమాల లతో సన్మానించారు. మండలంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా పండుగ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నందుకు సీఐని అభినందించారు. సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకుంటే అందరూ సంతోషంగా ఉంటారన్నారు. ఘర్షణలు, గొడవలు వల్ల సాధించేదేమిలేదన్నారు.

సంబంధిత పోస్ట్