విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు
AP: కాకినాడ పోర్ట్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. గతంలో పార్లమెంట్ సమావేశాల కారణంగా విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకాలేదు. దాంతో తాజాగా మరోసారి పోలీసులు నోటిసులు జారీ చేశారు. కాగా, కాకినాడ పోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ జరుపుతుంది.