AP: తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15వ తేదీలోగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ఏటా రూ.15 వేలు అందిస్తామని తెలిపారు.