సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.