AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. హోంమంత్రి అనిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పలువురు అధికారుల బృందంతో కలిసి ఆయన నిన్న బెంగళూరులో పర్యటించారు. అక్కడ బస్సులో ప్రయాణించి శక్తి గ్యారెంటీ పథకంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందిస్తామని వెల్లడించారు.