అనంతసాగరం: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆనం
అనంతసాగరం మండల కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సభా వేదిక ప్రాంగణంలో మంత్రిగా ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను ఏవి రూపంలో ప్రదర్శించారు. తర్వాత మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.