Feb 26, 2025, 15:02 IST/
ఫెయిల్ అవుతానని భయంతో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
Feb 26, 2025, 15:02 IST
TG: ఇంటర్లో ఫెయిల్ అవుతానని భయంతో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన సంజయ్ అనే విద్యార్ధి గతంలో ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. రెండోసారి కూడా ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహాశివరాత్రికి పరమశివుడిని దర్శించుకొనేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఈ దారుణాన్ని చూసి.. కన్నీరు మున్నీరవుతున్నారు.