నెల్లూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా, చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకే వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.