అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
గూడూరు నియోజవర్గంలోని చిల్లకూరు మండలం మోమిడి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.