Nov 23, 2024, 16:11 IST/
TG: కులగణన సర్వే 90 శాతం పూర్తి.. సీఎస్ కీలక ఆదేశాలు
Nov 23, 2024, 16:11 IST
రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాల్లో సర్వే పూర్తి కాగానే, మరి కొన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే కొనసాగుతుండగానే డేటాను కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. ఈ సర్వేలో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా, శనివారం వరకు 1,05,03,257 నివాసాలలో సర్వే (89.8 శాతం) పూర్తి అయినట్లు తెలిపారు.