గంగవరంలో రక్తదాన శిబిరం
కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో మంగళవారం మురారి మనోజ్ కుమార్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, సర్పంచు లక్ష్మి కుమారి, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.