వైసీపీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత పాలకీర్తి రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరులోని అతిధి గ్రాండ్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గత మూడు నెలల నుంచి అడ్రస్ లేకుండా వెళ్లిపోయి నేడు వైసిపి ఇన్చార్జిగా వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నారు. విజయ్ కుమార్ రెడ్డి భాష మార్చుకోవాలన్నారు.