Nov 04, 2024, 04:11 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Nov 04, 2024, 04:11 IST
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో సామ శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మంచాలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.