Mar 22, 2025, 01:03 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదం.. అడిషనల్ డీసీపీ మృతి
Mar 22, 2025, 01:03 IST
హయత్ నగర్ పీఎస్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆడిషన్ డీసీపీ టిఎమ్ నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మరణించాడు, ఉదయం 4. 30 గంటలకి వాకింగ్ వెళ్ళడానికి జాతీయ రహదారి దాటుతుండగా మొదటగా ఒక బస్ ఢీ కొట్టడంతో కిందపడగా వెనకాల వస్తున్న నూజివీడు డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందాడు. గత మూడు రోజుల క్రితం బాబ్జీ కి ఏసీపీ నుండి ఆడిషన్ ఎస్పీ గా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకో మూడు రోజుల్లో డిజిపి ఆఫీస్ లో రిపోర్ట్ చెయ్యాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది.