ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు.. విజయనగరం స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి.. తన బలం నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కానీ, వైసీపీ మాత్రం ఈ ఎన్నికలపై మౌనంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థుల ఖరారు, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించలేదని సమాచారం.