రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర ఖండించారు. వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదుష్టకరమని, పిట్టపురంలో జరిగిన దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహణం , అంతర్వేది జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథం దహణం చూస్తుంటే కొన్ని దృష్టశక్తులు కావాలనే హిందువుల మనోభావాల దెబ్బతినేలా, విద్వేషాలు రేచర్చకొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సర్వమతాలను గౌరవిస్తరని, సంప్రదాయ, ఆచారాలకు విలువ ఇస్తారని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా రీటైడ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.