వరికుంటపాడు: ప్రతి ఇంటిని సందర్శించి పరీక్షలు చేయాలి
వరికుంటపాడు మండలంలో జరుగుతున్న లెప్రసీ ఇంటింటి సర్వే ను సిబ్బంది బాధ్యతగా నిర్వహించాలని సిహెచ్ రాజశేఖర్ రాజు సూచించారు. ఆయన మండలంలోని తిమ్మారెడ్డి పల్లెలో మంగళవారం జరుగుతున్న సర్వేను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరీక్షించి, శరీరంపై స్పర్శ లేని, రాగి మచ్చలు, నొప్పిలేని పుండ్లు ఉంటే గుర్తించి వివరాలు నమోదు చేయాలన్నారు.