ఖరీఫ్ వ్యవసాయానికి నాణ్యమైన వరి విత్తనాలు అందించాలి

68చూసినవారు
ఖరీఫ్ వ్యవసాయానికి నాణ్యమైన వరి విత్తనాలు అందించాలి
ఖరీఫ్ వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి విజయనగరం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నారు జనార్ధన రావు, పట్టాభి లు అన్నారు. ఈ మేరకు సోమవారం రేగిడి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాములమ్మకు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందించారు. వరి విత్తనాలలో సంపద,అమూల్య, అజీమ్ వంటి విత్తనాలు ఇచ్చి రైతుల దిగుబడులకు సహకరించాలని కోరారు. మరో పది రోజుల్లో ఖరీఫ్ వ్యవసాయం ప్రారంభించబడుతుందన్నారు.