ఆర్డీవోని కలిసిన కనిగిరి రూరల్ టిడిపి నేతలు
కనిగిరి నూతన పదవి బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో కేశ్వర్ధన్ రెడ్డి ని కనిగిరి మండల రూరల్ టిడిపి నాయకులు మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్డీవో ని కలిసిన వారిలో కనిగిరి మండల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, చెంచిరెడ్డి, తదితరులు ఉన్నారు.