బీజేపీకి ప్రజల భద్రత కంటే పబ్లిసిటీయే ముఖ్యం: రాహుల్

64చూసినవారు
బీజేపీకి ప్రజల భద్రత కంటే పబ్లిసిటీయే ముఖ్యం: రాహుల్
దేశంలో మౌలిక వసతుల కల్పనలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఆరోపించారు. 'భారత్లో మౌలిక వసతుల కల్పన దారుణంగా దిగజారింది. ముంబై రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట అందుకో ఉదాహరణ. గత ఏడాది బాలాసోర్ రైలు ప్రమాదంలో 300మంది చనిపోయారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోయింది. BJPకి కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే తప్ప ప్రజల భద్రత కాదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్