పద్మశ్రీ గ్రహీత, కణ భౌతిక శాస్త్రవేత్త రోహిణి గాడ్బోలే పూణెలో శుక్రవారం కన్నుమూశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక సంతాప నోట్లో ఇలా పేర్కొంది. ”ప్రొఫెసర్ రోహిణి గాడ్బోలే మృతికి చాలా బాధతో మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈ తెల్లవారుజామున నిద్రలోనే ఆమె ప్రశాంతంగా కన్నుమూశారు. గొప్ప శాస్త్రవేత్తగానే కాకుండా, ఆమె గొప్ప నాయకురాలు, గైడ్, సహోద్యోగి, స్నేహితురాలు.