సింగరాయకొండ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండకు చెందిన బిల్లా నవీన్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం అందించారు. అనారోగ్యం కారణంగా నవీన్ ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందాడు. తన వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా రూ. 1, 0, 9, 000 నగదు శాంక్షన్ అయింది. ఆ చెక్కును మంగళవారం మంత్రి స్వామి నవీన్ కు అందజేశారు. సీఎం చంద్రబాబు కు నవీన్ కృతజ్ఞతలు తెలిపాడు.