

మార్కాపురం: చోరీకి విఫలయత్నం
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోలభీమునిపాడు వద్ద ఉన్న ఆలయంలో ఓ యువకుడు చోరీకి విఫలయత్నం చేసిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సుంకేసుల రహదారిలోని ముద్దసానమ్మ ఆలయానికి ఈనెల 3న ఓ యువకుడు ఇనుప రాడ్డుతో చోరీ చేసేందుకు వచ్చి, అక్కడున్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేశాడు. ఆ దృశ్యాలన్నీ మరో సీసీ కెమెరాలో నమోదయ్యాయి. చివరకు ఆలయంలో ఏమీలేవని గుర్తించి రాడ్డు బుజాన వేసుకొని నిరాశతో వెనుదిరిగాడు.