మార్కాపురం: చిరంజీవికి బెస్ట్ తాహశీల్దార్ అవార్డు
ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి సోమవారం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ చేతుల మీదుగా బెస్ట్ తహశీల్దార్ అవార్డును సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందుకున్నారు. నవంబర్ మాసానికి విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన చిరంజీవికి అవార్డు అందించినట్లుగా సబ్ కలెక్టర్ తెలిపారు. అధికారుల నుంచి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకే ఈ అవార్డులను అందిస్తున్నామని సబ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు.