
పొదిలి: వ్యవసాయ విస్తరణ అధికారిని ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా పొదిలి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విస్తరణ అధికారిగా పనిచేస్తున్న అధికారిని మంగళవారం కార్యాలయంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండడంతో పై అధికారులు పరిజ్ఞానం పెంచుకోవాలని మందలించినందుకు అవమానంగా భావించి అధికారులు అరుంధతి ఆత్మహత్యకు యత్నించింది. తోటి సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి రక్షించారు. వైద్యులు ఆమెకు అపాయం లేదని తెలిపారు.