జనవరి నాటికి రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అనకాపల్లి సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో అన్ని రకాల రోడ్లను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. రూ.76 వేల కోట్లతో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఓఆర్ అమరావతి, విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డు, భోగాపురం నుంచి మూలపేట వరకు సముద్ర తీర ప్రాంతంలో రోడ్లు వేస్తామన్నారు. రైల్వేను అభివృద్ధి చేస్తామని తెలిపారు.