ఏపీలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్లో జొన్నలను కూడా చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు జొన్నలు తీసుకోవచ్చు. గరిష్టంగా 3 కేజీల వరకు ఇస్తారు. కిలో కందిపప్పు రూ.67కి, అర కేజీ పంచదార రూ.17కు సబ్సిడీపై ఇస్తున్నారు. రేషన్ కార్డుదారులకు 100 శాతం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.