ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Sep 16, 2024, 15:09 IST/

ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు ప్లాన్ చేశా: చంద్రబాబు (వీడియో)

Sep 16, 2024, 15:09 IST
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్ల పెట్టుబడులు తద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు నేను ప్లాన్ చేశాను. ఎలా అంటే వచ్చే 5 ఏళ్ళలో గ్రీన్ ఎనర్జీలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటాయని కేంద్ర మంత్రి చెప్తున్నారు. అందులో 1/3rd పెట్టుబడులు, మా రాష్ట్రంలో వచ్చేలా మా యాక్షన్ ప్లాన్, మా గోల్, మా విజన్ ఉంటుంది." అని అన్నారు.