బాలికపై వృద్ధుడు లైంగిక దాడి
AP: కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో దారుణం జరిగింది. బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. రెండో తరగతి చదువుతున్న బాలిక పక్కింట్లోకి వెళ్లిన తన కుక్క పిల్ల కోసం వెళ్లింది. అయితే ఇంట్లో ఉన్న పబ్బుల నారాయణ (60) అనే వృద్ధుడు బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. భయంతో బాలిక కేకలు వేసింది. అతని నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అరెస్ట్ చేశారు.