మహిళ విషయంలో వివాదం.. విద్యుత్‌ షాక్‌ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు

64చూసినవారు
మహిళ విషయంలో వివాదం.. విద్యుత్‌ షాక్‌ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు
TG: మహిళ విషయంలో ఏర్పడిన వివాదంతో తమ్ముడు.. అన్నను కిరాతకంగా చంపాడు. మెదక్‌ జిల్లా శివ్వంపేటలోని నాను తండాకు చెందిన తేజావత్‌ శంకర్‌(28), గోపాల్‌ అన్నాదమ్ములు. వివాహమైన శంకర్‌‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళతోనే తమ్ముడు కూడా చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న అన్న శంకర్‌‌కు తమ్ముడు విద్యుత్ షాక్‌ ఇచ్చి ప్రాణాలు తీశాడు.

సంబంధిత పోస్ట్