BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఎవరికీ కేటాయించరు. సార్వత్రిక ఎన్నికల్లో 100 స్ట్రైక్‌రేట్(21 MLA, 2 MP)తో విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.