అనంతపురం నగరం ప్రతిరోజు శుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు అనంతపురం మేయర్ మొహమ్మద్ వసీం సలీం తెలిపారు. మంగళవారం ఉదయం మేయర్ నగరంలోని పలు డివిజన్లను పరిశీలించారు. నగరంలోని టవర్ క్లాక్ బ్రిడ్జిపై చెత్త ఉండటాన్ని మేయర్ గమనించి రాబోవు రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని పారిశుద్ధ్య విభాగం అధికారులను సూచించారు.