ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు నూతన గంట మండపం మరియు నైవేద్య గంట ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాను మాట్లాడుతూ. కార్తీక మాసం సోమవారం మొదట ప్రాతఃకాల ఆరాధనలు పూర్తి చేసిన పిదప శ్రీ వారి ఉత్సవ మూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాశన, వాస్తుహోమం నిర్వహించమన్నారు.