నిరుద్యోగ భృతి.. దరఖాస్తులకు ఆహ్వానం!
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది. వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులను దేవాదాయశాఖ ఆహ్వానించింది.