విజయవాడలో జనవరి 5వ తేది 2025 జరిగే హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది. ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విహెచ్పి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరివార సంస్థల ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక హిమకర్ మాట్లాడుతూ దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైందవ శంఖారావ కరపత్రాలు విడుదల చేశారు.