తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
TG: హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు. అయితే.. రెండు రోజులుగా తల్లి, కుమారుడి మృతదేహాలు గదిలోనే ఉన్నాయి. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.