AP: తను చనిపోతూ.. పెద్దయ్య ముగ్గురి ప్రాణాలు నిలిపారు. అవయవదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన పెద్ద పెద్దయ్య (59) బ్రెయిన్‌డెడ్ అయి చనిపోయారు. పెద్దయ్య భార్య కాంతమ్మ, కుమారులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. పెద్దయ్య అవయవాలను గ్రీన్ ఛానెళ్ల ద్వారా నెల్లూరు, విజయవాడకు తరలించారు. కవితారాణి, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్‌లకు పెద్దయ్య అవయవాలను అమర్చారు.