AP: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. స్టేజ్‌పై పవన్ మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ.. ఓజీ.. అంటూ కేకలు వేశారు. దాంతో పవన్ నవ్వుతూ.. ‘ఓజీ.. ఓజీ అని నా దుంప తెంపేస్తున్నారు. మూడు సినిమాలున్నాయి. దాని గురించి మాట్లాడుదాం. ఓజీ సినిమా కంటే నాకు మీ భవిష్యత్తు ముఖ్యం.’ అని అన్నారు.