నేడు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున (గురువారం) విజయవాడ కనకదుర్గమ్మ శక్తి రూపమైన దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి, ఇంద్రకీలాద్రిపై దుర్గగా.. స్వయంభువై అమ్మవారు వెలసింది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, ఈ అష్టమిని 'దుర్గాష్టమి' అని వ్యవహరిస్తారు. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.