నల్లమల అడవుల్లో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి (వీడియో)

85చూసినవారు
నల్లమల అడవుల్లో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల అడవుల్లోని అమరిగిరి గ్రామానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో చిన్న గండి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద 10 ఏళ్ల చిరుత పులి విగతజీవై పడి ఉన్నది. అయితే ఈ చిరుత అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వేటగాళ్లు ఏమైనా.. విష ప్రయోగం చేసి చంపి ఉంటారా? లేదా వేటగాళ్లు ఉచ్చు వేసి హతమార్చారా ? లేదా సహజ మరణమా? అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్