నితీశ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ బాదిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 359/9గా ఉంది.