AP: తిరుమల లడ్డూ తయారీపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. నాణ్యమైన ముడి సరుకులతోనే లడ్డూ తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీ లడ్డూ ఘటనను ఉద్దేశించి తిరుమలలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ కోటాను రద్దు చేశామన్నారు.