ఎంపీలపై సీఎం చంద్రబాబు సీరియస్
AP: సమావేశానికి హాజరుకాని కొందరు ఎంపీలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి బాధ్యత ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు ఎమ్మెల్యే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలదేనని చెప్పారు.