AP: నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్ ఇచ్చారు. తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేయాలన్నారు. దాంతో వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పథకాల అమలుకు కూటమి సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తుంది.