సోంపేట: విద్యుత్ వైర్ తగిలి అగ్నికి కాలి బూడిద అయిన చెట్లు
వాతావరణం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో సోంపేట మండలం మామిడిపల్లి కాలనీ సమీపంలో ఈదురు గాలులకు 11 కెవి విద్యుత్ వైరు సమీపంలో ఉన్న తాటి చెట్టుకు తాకింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి సమీపంలో ఉన్న పచ్చని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ శాఖ సిబ్బంది. స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.